03-04-2025 05:53:15 PM
పాపన్నపేట: కుటుంబ కలహాలతో యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని నార్సింగి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం వివరాలు... గ్రామానికి చెందిన మంగలి నరేష్ కుమార్(26)కు గత కొన్ని రోజులుగా భార్య భర్తల మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఇంట్లో జరుగుతున్న గొడవలతో మనస్తాపం చెందిన నరేష్ కుమార్ బుధవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు కుటుంబీకులకు సమాచారం అందించారు. వారు తలుపులు తీసి చూడగా ఉరి వేసుకుని కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.