25-03-2025 06:49:11 PM
లక్షేట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని మహాలక్ష్మీ వాడకు చెందిన భూమి విష్ణు వర్ధన్ (22) అనే యువకుడు సోమవారం రాత్రి గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మృతునికి ఇటీవలే వివాహం అయింది. మృతుని తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణించారు. కాగా, ఆన్లైన్ బెట్టింగ్(Online Betting) యాప్ లలో విష్ణువర్ధన్ పెట్టుబడులు పెట్టి నష్టపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆత్మహత్య సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.