15-04-2025 08:34:20 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): నెన్నెల మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామానికి చెందిన చల్మటకారి అనిల్ కుమార్ (24) అనే యువకుడు దూలానికి చీరతో ఉరి వేసుకుని మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. అనారోగ్య సమస్యల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ లెటర్ లభించినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. మృతుని తండ్రి చెలిమటికారి సత్తయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు.