calender_icon.png 7 March, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

07-03-2025 12:26:22 AM

నల్లగొండ, మార్చి 6 (విజయక్రాంతి) : ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఉరేసుకొని యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలివి.. దామరచర్ల మండలం వాడపల్లి గ్రామానికి చెందిన గంధం అరుణ్ కుమార్ (26) కొంతకాలంగా దామరచర్లలోని నాగకృష్ణ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు.

ఈ నెల 3న బంక్‌లో పనిచేసి వెళ్లి కనిపించకుండా పోయాడు. మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గురువారం రూరల్ పోలీసులకు సమాచారం అందింది. మృతుడి ఆనవాళ్లను వా ట్సాప్, సోషల్ మీడియాలో పోస్టుచేయగా వాడపల్లివాసులు గుర్తించి అరుణ్‌కుమార్ కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు.

కుటుంబీకులు మిర్యాలగూడ చేరుకొని మృతదేహం అరుణ్‌దేనని నిర్ధారించారు. అప్పుల కారణంగానే యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. మృతుడి సోదరుడు గంధం వెంకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ లోకేశ్ తెలిపారు.