calender_icon.png 12 March, 2025 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య

11-03-2025 10:51:15 AM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలం(Bellampalli Mandal)లోని పెరిక పల్లి గ్రామానికి చెందిన మోట పలుకుల మనోజ్ కుమార్ (18) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత నాలుగు రోజుల కిందట మనోజ్ కుమార్ ఇంట్లో పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి(Warangal MGM Hospital) తరలించారు. అక్కడినుండి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. మృతుని తండ్రి స్వామి ఆటో డ్రైవర్ గా పనిచేస్తుండగా, తల్లి సునీత గ్రామంలో వ్యవసాయ కూలీల పని చేస్తుంది. ఇంటర్మీడియట్ చదువుతున్న మనోజ్ కుమార్ ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది.