12-03-2025 10:17:57 AM
పోలీసుల ముందే పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకున్న వైనం
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల(Thungathurthy mandal) కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో రావులపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకున్న సంఘటన సోమవారం రాత్రి జరగగా ఆలస్యంగా వెలుగు చూసింది. తుంగతుర్తి ఎస్సై క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రావులపల్లి గ్రామానికి చెందిన నాగయ్యకు అడ్డ గూడూరు మండలం లక్ష్మీకాళ్ళపల్లి గ్రామానికి చెందిన మహిళతో వివాహమైంది.
గత కొంతకాలంగా ఇరువురు మధ్య ఘర్షణతో భార్య దూరంగా ఉన్నది. ఆవేదనకు గురైన నాగయ్య మోటార్ బైక్లు పై తుంగతుర్తి పోలీస్ స్టేషన్కు శనివారం సాయంత్రం వచ్చి బైకు పక్కనపెట్టి, చిన్న బాటిల్ లోని పెట్రోల్ తీసుకుని వచ్చి ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ ముందు నిలబడి పోసుకొని నిప్పంటించుకున్నాడు తక్షణమే డ్యూటీలో ఉన్న పోలీసులు చూసి మంటలు ఆర్పి మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట ఏరియా దావకానకు తరలించినట్లు జరిపారు. జరిగిన సంఘటనపై తుంగతుర్తి ఎస్సై విచారణ జరుపుతున్నట్టు పేర్కొన్నారు.