గోదావరిఖని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా గోదావరిఖని(Godavarikhani)కి చెందిన నంది శ్రీనివాస్ పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటన గోదావరిఖని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంతో యువకుడికి తీవ్రంగా కత్తిపొట్లు పడడంతో చికిత్స నిమిత్తం స్థానికులు 108 అంబులెన్స్ లో గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి(Godavarikhani Government Hospital)కి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.