calender_icon.png 23 December, 2024 | 11:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విచ్చలవిడిగా బెల్ట్ షాపులు మంథనిలో మత్తుకు బానిసవుతున్న యువత

23-12-2024 12:59:31 AM

మంథని, డిసెంబర్ 22(విజయక్రాంతి): మంథని డివిజన్ లోని  గ్రామాలలో గల్లీ గల్లీకో బెల్ట్ షాపులు వెలుస్తుండడంతో యువకులు మద్యానికి అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును చేతులారా సర్వనాశనం చేసుకుంటున్నారు. అప్పులు చేసి మరి అధిక ధరకు మద్యాన్ని కొనుగోలు చేసి సేవించి ఇబ్బందుల పాలవుతున్నారు. బెల్ట్ షాపుల్లో వేకువజామున మద్యం దొరుకుతుండడంతో మంథని డివిజన్  వ్యాప్తంగా ఈ పరిస్థితి నెలకొంది. మంథని మున్సిపాలిటీలో  విచ్చలవిడిగా బెల్టు షాపులను నడుస్తున్నాయి. బెల్ట్ షాప్‌లతో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నం అవుతున్నాయి. మద్యం ప్రియుల నుంచి నిర్వాహకులు అందినకాడికి దోచుకుంటున్నారు. పొద్దంతా కష్టం చేసి సాయంత్రం పూట సేదతీరేందుకు మద్యతరగతి వారు మద్యం సేవిస్తుంటారు. ఇప్పటికైనా ఈ బెల్టుషాపులను ఎక్సుజ్ అధికారులు మూసివేయాలని ప్రజలు కోరుతున్నారు.