calender_icon.png 10 January, 2025 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీరిచ్చిన తోడ్పాటు మరింత బలం చేకూర్చింది

05-01-2025 06:40:54 PM

విద్యానిధికి రూ.2 లక్షలు విరాళం అందించిన రిషి విద్యాసంస్థల డైరెక్టర్లు

పేద విద్యార్థులకు అండగా ఉందాం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి... 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): విద్యానిధికి తోడ్పాటును ఇచ్చేందుకు ముందుకు వచ్చి మీరు చేస్తున్న సహాయం ఎంతోమంది పేద విద్యార్థులకు మంచి జరుగుతుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి రిషి విద్యాసంస్థల డైరెక్టర్లను ప్రత్యేకంగా అభినందించారు. ఆదివారం విద్యానిధికి రూ.2 లక్షల విలువ గల చెక్కును రిషి విద్యాసంస్థల డైరెక్టర్లు ఎమ్మెల్యేకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంతోమంది పేద విద్యార్థులకు ఉపయోగపడుతుందన్నారు. ఎమ్మెల్యే  ఆశయం మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేయుటకు మా వంతు కృషి చేస్తామని రిషి విద్యాసంస్థల డైరెక్టర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, రిషి డైరెక్టర్లు పూజిత మోహన్ రెడ్డి, చంద్రకళ, సుశాంత్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.