calender_icon.png 25 November, 2024 | 4:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పథకాల అమలులో మీ సేవ కీలకం

05-11-2024 02:50:31 AM

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 

ముషీరాబాద్, నవంబర్ 4: ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో మీ సేవ నిర్వాహకులు కీలక పాత్రను పోషిస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో తెలంగాణ మీ సేవ ఫెడరేషన్ 14 వార్షికోత్సవం నిర్వహించగా, మంత్రి శ్రీధబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీ సేవ నిర్వాహకుల కమీషన్‌ను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 4,754 మీ సేవ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పరిశీలిస్తుందని అన్నారు.

ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఎన్ని అడ్డంకులు వచ్చినా కచ్చితంగా నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు మీ సేవ నిర్వాహకుల మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చెక్కులను మంత్రి అందజేశారు.

కార్యక్రమంలో టీజీటీఎస్ చైర్మన్ మన్నె సతీశ్‌కుమార్, రాష్ట్ర మీ సేవ కమిషనర్ టీ రవికిరణ్, డిప్యూటీ డైరెక్టర్ పీ విజయభాస్కర్ గౌడ్, జీ వరలక్ష్మి, ఈ సతీశ్, బైర శంకర్, మహ్మద్ అబ్దుల్ యోహిద్, ఎర్రోళ్ల బాలరాజు, కే శ్రీనివాస్‌మూర్తి, మహ్మద్ అన్వర్, పిన్ని రాము, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.