calender_icon.png 14 February, 2025 | 1:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా గుండెలో మీ స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే!

10-02-2025 12:19:00 AM

‘పుష్ప 2 ది రూల్’ బృందానికి ఆ చిత్ర కథానాయిక రష్మిక మందన్న కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ విషయమై ఆమె ఆసక్తికర పోస్ట్ పెట్టింది. శనివారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించిన థ్యాంక్స్ మీట్‌లో రష్మిక పాల్గొనలేకపోయింది. అందుకే సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ‘నిన్న జరిగిన పుష్ప2 థ్యాంక్స్ మీట్‌లో నేను పాల్గొనలేకపోయా. అందుకే ఈరోజు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా.

సుకుమార్ సర్, అల్లు అర్జున్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు థాంక్యూ. మీరెంతో శ్రమించి మాకు ఇలాంటి మాస్టర్ పీస్ అందించినందకు ఒక ప్రేక్షకురాలిగా ధన్యవాదాలు. అలాగే, శ్రీవల్లిగా చెప్పాలంటే.. మీకు ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సినిమాను తెరకెక్కించటంలో అన్ని విభాగాలూ అద్భుతంగా పనిచేశాయి.

ఈ ప్రయాణంలో నన్ను భాగం చేసినందుకు, నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రత్యేకమైన రోల్ ఇచ్చినందుకు థాంక్యూ’ అని పేర్కొంది. ఇదిలా ఉండగా ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ఛావా’తో మరోమారు ప్రేక్షకుల ముందుకు రానుందీ సౌత్ సోయగం.

ఫిబ్రవరి 14న విడుదల కానున్న ఈ సినిమాలో శంభాజీగా విక్కీ కౌశల్ నటిస్తుండగా, ఆయన భార్య ఏసుబాయి పాత్రను రష్మిక పోషించింది. రష్మిక ఇంకా సల్మాన్‌ఖాన్ సరసన ‘సికందర్’లోనూ నటిస్తోంది. ‘థామ’, ‘కుబేర’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘రెయిన్‌బో’ చిత్రా లు కూ డా ఆమె ఖాతా లో ఉన్నాయి.