calender_icon.png 3 March, 2025 | 4:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నా నీ ప్రేమ సంద్రమే..

02-03-2025 12:42:20 AM

హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘దిల్ రూబా’. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘దిల్ రూబా’ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్,  ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విశ్వ కరుణ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

‘దిల్ రూబా’ సినిమా మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ‘దిల్ రూబా’ నుంచి  మోస్ట్ అవేటెడ్ సాంగ్ ‘కన్నా నీ..’ రిలీజ్ చేశారు. ‘కన్నా నీ..’ పాటను టాలెంటెడ్ మ్యుజీషియన్ సామ్ సీఎస్ అద్భుతమైన ట్యూన్ తో కంపోజ్ చేశారు.

భాస్కరభట్ల హార్ట్ టచింగ్ లిరిక్స్ అందించగా.. సత్యప్రకాష్, మాళవిక సుందర్ అద్భుతంగా ఆలపించారు.  ‘కన్నా నీ..’ పాట ఎలా ఉందో చూస్తే.. ‘ కన్నా నీ ప్రేమ సంద్రమే, నేను నీ తీరమే, కన్నా నువ్వు నా ప్రాణమే, నేను నీ దేహమే, అలలుగా తాకగానే, కరిగిపోనా నీలో, ప్రళయమై తాండవిస్తే, అలజడే నాలో ..’ అంటూ గుండె లయనే అక్షరాలుగా మార్చిన లవ్ వైబ్రేషన్ తో సాగుతుందీ పాట.