calender_icon.png 15 January, 2025 | 11:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీ జీవితం.. మీ చేతుల్లోనే!

14-09-2024 12:00:00 AM

ఉన్నత చదవులు చదువుతున్నా సొంత నిర్ణయాలు తీసుకోవడంలో నేటికి వెనుకబడిపోతున్నా రు కొంతమంది అమ్మాయిలు. ఏ కాలేజీలో జాయి న్ కావాలి? ఏ గ్రూపు తీసుకోవాలి? అనే విషయాలపై పేరెంట్స్‌పై ఆధారపడుతుంటారు. అలాకాకుం డా మీకంటూ సొంత నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే జీవితాంతం తల్లిదండ్రుల నీడలోనే బతకాల్సి ఉంటుంది. వ్యక్తిగత జీవితం, కెరీర్, ఆరోగ్యం తదితర విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. జీవితంలో మార్పులు, సవాళ్లతో ఆశ్చర్యంగా ఉంటుంది. అలాంటప్పుడు నిర్ణయం తీసుకోలేనప్పుడు మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుంది. వృత్తిపరమైన జీవితం, సంబంధాలు లాంటి సున్నితమైన అంశాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. 

అయితే కీలక నిర్ణయాలు తీసుకోవడంలోజాప్యం జరిగితే.. అవకాశాలు కోల్పోవడంతోపాటు ఒత్తిడికి గురవుతారు. సైకాలజిస్టులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. “నిరంతర సందేహాలు మానసికంగా మనిషిని కుంగదీస్తాయి. ఇది ఆందోళనకు దారితీస్తుంది. ఇతరుల అసహనానికి గురవుతారు.” తులసి హెల్త్ కేర్ సీఈవో,  సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ గోరవ్ గుప్తా చెప్పారు. వర్క్‌ప్లేస్‌లో నిర్ణయాలు తీసుకోవడానికి సంకోచించడం వల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. మేనేజ్‌మెంట్ నాయకత్వ లోపంగా భావిస్తుంది. 

నిర్ణయాలు తీసుకోవాలంటే మీ లక్ష్యాలు, విలువలను అర్థం చేసుకోవాలి. ప్రశాంతంగా కూర్చొని జీవితంలో మీకు ఏమి కావాలో, ఏ దిశలో వెళ్లాలనుకుంటున్నారో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఈ విస్తృత అవగాహన కచ్చితమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి. మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్న తర్వాత, తిరిగి ఆలోచించడం, ఫలితాలను విశ్లేషించడం అలవాటు చేసుకోండి. ఏది బాగా జరిగింది?, ఏది బాగుండదు? కూడా చెక్ చేసుకోవాలి.