30-03-2025 06:37:18 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆదివారం ఉగాది పండుగను పురస్కరించుకొని యువర్స్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు ఉగాది పచ్చడి వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గురు వినయ్, తూప్తి నాగరాజు, ఫౌండేషన్ సభ్యులు సచిన్ యాదవ్, సాయి తేజ, సాయి కృష్ణ, శ్రీనివాస్, నవీన్ సతీష్ వేద ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.