calender_icon.png 21 December, 2024 | 11:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీ గుండె జర భద్రం

29-09-2024 12:00:00 AM

నేడు వరల్డ్ హార్ట్ డే :

మానవదేహంలోని అవయవాలన్నిటిలో  ప్రధాన అవయ వం గుండె. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే గుండె పనితీరు బాగుండాలి. గుండె ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి అంత ఎక్కు వ కాలం జీవించే అవకాశం ఉంటుంది. జీవిత కాలాన్ని గుండె నిర్ణయిస్తుంది. అందుకే ఎవరైనా మరణిస్తే గుండె ఆగిపోయింది అంటాం. కనుక గుండెను ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉంచుకోవ డం చాలా అవసరం.

ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబరు 29న గుండె దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ (డబ్ల్యూహెచ్‌ఎఫ్)లు సంయు క్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తాయి. ఈ సందర్భంగా, గుండె జబ్బులపై అవగాహన పెంచుకొని అవి రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తారు.

గుండె సంబంధిత వ్యాధులను నివారించ డంకోసం 1946లో జెనీవాలో వరల్డ్‌హార్ట్ ఫెడరేషన్ సంస్థ ఏర్పాటయింది. 1999లో అప్పటి ఆ సంస్థ అధ్యక్షుడు ఆంటోనియో బాయెస్ డీ లూనా తొలిసారిగా ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. అప్పటినుండి అది ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. 

దాదాపు వందకు పైగా దేశాలలో ఏర్పాటు చేసిన సుమారు రెండొందల కార్డియాలజీ సొసైటీల ద్వారా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, నడక, పరుగు, ఇతరత్రా వ్యాయామ సంబంధిత ఆటలు ఆడించ డం, బహిరంగ చర్చలు, సైన్స్ సెమినార్లు నిర్వహించడం లాంటి కార్యక్రమాలు చేస్తుంటారు.  ఈ ప్రచారం ద్వారా మానవ  ప్రపంచాన్ని ఆరోగ్యవంతమైన సమాజంగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యం.

నిశ్శబ్ద హంతకులు

గుండె సంబంధిత వ్యాధులను ‘సైలెంట్ కిల్లర్స్’ (నిశ్శబ్ద హంతకులు)గా చెబుతారు. క్యాన్సర్ కన్నా ఎక్కువ మరణాలు గుండె వ్యాధుల వల్లనే సంభవిస్తున్నాయంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మిగతా వ్యాధుల మాదిరిగా స్పష్టమైన సంకేతాలు కనబడినా అవగాహనా లోపం వల్ల వాటిని గుండె సంబంధ సమస్యలుగా  చాలామంది గుర్తించలేకపోతుంటారు.

గుండె జబ్బు అనగానే సాధారణంగా మనకు గుండె పోటు ఒక్కటే గుర్తుకొస్తుంది. గుండెపోటు పెద్ద సమస్యే, కాదని అనడంలేదు కానీ మరికొన్ని కీలక సమస్యలూ ఉన్నాయి. నిజానికి గుండె ఒక పంపులా పనిచేస్తూ శరీరంలోని అన్ని భాగాలకు రక్తం సరఫరా చేస్తుంది. మామూలు పంపులు పని చేయటానికి విద్యుత్తు ఎలా అవసరమో, అలాగే మన గుండె నిరంతరం కొట్టుకోవటానికి కూడా శక్తి కావాలి.

గుండె వేగం తగ్గడంవల్ల రక్త సర ఫరా మందగించి, మెదడుకు తగినంత రక్తం అందదు. ఊపిరి తీసుకోవడం  ఇబ్బందిగా ఉంటుంది. అలసట, నిస్సత్తువ ఆవహిస్తుంది. నాడి నెమ్మదిగా కొట్టుకుంటుంది. వేగం పెరిగితే గుండె దడ పుడుతుంది. తగుస్థాయిలో గుండె కొట్టుకోలేకపోవడం వల్ల రక్తం అన్ని అవయవాలకు చేరదు. ఫలితంగా విపరీతమైన ఆయా సం వస్తుంది.

కొన్నిసార్లు గుండెలో తేలికపాటి నొప్పికూడా రావ చ్చు. తల తిరిగినట్లు అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో స్పృహ తప్పటం కూడా జరగవచ్చు. కనుక ఇలాంటి పరిస్థితి తలెత్తక ముందే గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. జీవన విధానంలో, ఆహార అలవాట్లలో చిన్నచిన్న మార్పుల ద్వారా ఇలాంటి ప్రమాదాన్ని నివారించవచ్చు. అంటే, చిన్నపాటి వ్యాయామాలు చేయాలి.

నడవాలి, తేలికపాటి పరుగు లాంటివి అలవాటు చేసుకోవాలి. ధూమపానం, మద్యపానం అలవాటు గనక ఉంటే, పూర్తిగా మానేయాలి. టీ, కాఫీలు తగ్గించాలి. ఆహారంలో ఆకు కూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇవి గుండె పనితీరును మెరుగు పర్చడంలో ఎంతగానో దోహదపడతాయి. ప్రతిరోజు ఉదయం అల్పాహారంగా ఓట్స్ లేదా బార్లీ తీసుకోవడం గుండెకు మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తారు.

వీటిలో లభించే బీటా గ్లూకాన్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. రోజువారీ ఆహారంలో ఇలాంటి చిన్నచిన్న నియమాలు పాటించే వారికి,  మిగిలిన వారితో పోలిస్తే గుండెపోటు వచ్చే అవకాశాలు 11 శాతం తక్కువగా ఉంటాయట. దాని సంకేతాలను అర్థంచేసుకొని అప్రమత్తం కావాలి.

వ్యాపార వైద్యుల్ని కాకుండా, నమ్మకమైన మానవీయ వైద్యుల్ని అప్పుడప్పుడూ సంప్రదిస్తూ ఉండాలి. నాణ్యమైన, సమతుల ఆహారం, సరైన నిద్ర, తేలిక పాటి వ్యాయామాలు చేస్తూ, సంతోషంగా జీవించగలిగితే ఆరోగ్యంగా జీవించవచ్చు.

- యండి. ఉస్మాన్ ఖాన్