calender_icon.png 31 January, 2025 | 8:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీ కుటుంబం మీ కోసం ఎదురు చూస్తుంది

29-01-2025 12:57:59 AM

* ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్, జనవరి 2౮ (విజయ క్రాంతి) : ప్రయాణించే సమయంలో నియమ నిబంధనలు పాటించేందుకుగాను ప్రతి ఒక్కరు సదా చూపాలని మీ కుటుంబం మీ ఇంటి దగ్గర ఎదురుచూస్తుందని విషయాన్ని ప్రతిక్షణం స్మరించుకుంటూ ముందుకు సాగాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణం లోని అల్మాస్ ఫంక్షన్ హాలు లో రాష్ర్ట రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీస్, వెస్టెర్న్ ఆంధ్ర టోల్వేస్ ప్రైవేటు లిమిటెడ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే మాట్లాడారు.

నియమ నిబంధనలు అందరికీ తెలిసిన పాటించకపోవడం వల్లనే ప్రమాదాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. ఏమి కాదు అనుకొని నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణం చేస్తారని ప్రమాదం అనేది చెప్పి రాదని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు మదిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

సంబంధిత అధికారులు నిరంతరం నిబంధనలు పాటించాలని చెబుతున్న కొందరు పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదాలను నిలయంగా మారుతుందని పేర్కొన్నారు. నిబంధనలు పాటించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో  కిషన్ , వాసుదేవ్, వర్టికల్ డిఎస్పీ సుదర్శన్, ట్రాఫిక్ సిఐ భగవంత్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, ఐఎన్టీయుసి రాములు యాదవ్, ఆర్టీఎ సభ్యులు సలీం, జిల్లా ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేంధర్, నాయకులు అజ్మత్ అలి, లీడర్ రఘు, ఫయాజ్, తదితరులు పాల్గొన్నారు.