ఏఈ, కెమిస్ట్ అభ్యర్థులకు జెన్‌కో షాక్
పరీక్షకు ఒకరోజు ముందు కేంద్రాల మార్పు
హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (జెన్‌కో).. అసిస్టెంట్ ఇంజినీర్లు (ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల భర్తీ కోసం జూలై 14న సీబీటీ పరీక్ష నిర్వహించనుంది. ఈ క్రమంలో అభ్యర్థులకు జెన్‌కో షాకిచ్చింది. పరీక్ష ఒకరోజు ముందు(జూలై 13) ఎగ్జామ్ సెంటర్లను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. పరీక్షకు ఒకరోజు ముందు సెంటర్లను సందర్శించాలని చెప్పిన జెనకో.. ఏకంగా సెంటర్లు మార్చడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలుత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)కు కేపీఎం టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్‌ను సెంటర్‌గా ఎంపిక చేసిన జెన్‌కో.. తర్వాత భోజ్‌రెడ్డి ఉమెన్ ఇంజినీరింగ్ కళాశాల, ఎంవీఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షలను నిర్వహించనున్నట్లు శనివారం ప్రకటన విడుదల చేసింది.