calender_icon.png 9 January, 2025 | 2:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆఫ్గన్ జట్టు మెంటార్‌గా యూనిస్ ఖాన్

08-01-2025 11:15:24 PM

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ

ఇస్లామాబాద్: పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగుతున్న అఫ్గానిస్థాన్ జట్టు తమ మెంటార్‌గా మాజీ పాక్ క్రికెటర్ యూనిస్ ఖాన్‌ను నియమించుకుంది. గ్రూప్ ఉన్న అఫ్గానిస్థాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో మ్యాచ్‌లు ఆడనుంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పెద్ద జట్లకు షాకిచ్చిన ఆఫ్గన్ జట్టు చాంపియన్స్ ట్రోఫీలోనూ అదే ఫలితాన్ని రాబట్టాలని చూస్తోంది. ఈ మేరకు యూనిస్ ఖాన్ మార్గనిర్దేశకత్వంలో మరింత రాటు దేలుతామని ఆఫ్గన్ క్రికెట్ బోర్డు తెలిపింది. 2023 వన్డే ప్రపంచకప్‌కు భారత మాజీ ఆటగాడు అజయ్ జడేజాను మెంటార్‌గా నియమించుకుంది. ఇక 2024 టీ20 ప్రపంచకప్‌కు విండీస్ మాజీ బౌలర్ డ్వేన్ బ్రావోను బౌలింగ్ కన్సల్టెంట్‌గా ఎంపిక చేసుకొని ప్రయోజనం పొందింది. పాకిస్థాన్ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్న యూనిస్ ఖాన్ ఆ జట్టు తరఫున 118 టెస్టులు, 265 వన్డేలు, 25 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు. 2017లో ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం పాక్‌కు బ్యాటింగ్ కోచ్‌గా సేవలందించిన యూనిస్ ఖాన్ బోర్డుతో సమస్యల కారణంగా 2021లో పదవి నుంచి తప్పుకున్నాడు.