calender_icon.png 4 March, 2025 | 2:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరిలో స్నానానికి దిగి యువకుడు మృతి

02-03-2025 03:03:58 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): గోదావరిలో పుణ్యస్నానం ఆచరిస్తూ ప్రమాదవశాత్తు ఓ యువకుడు నదిలో మునిగి మరణించిన ఘటన హాజీపూర్ మండలం ముల్కల గ్రామ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మంచిర్యాల పట్టణానికి చెందిన ఉసికమల్ల శ్రవణ్(22) నదిలో లోతైన ప్రదేశంలో స్నానం చేస్తుండగా నీటి ప్రవాహన్ని ఎదుర్కొన్నట్లు హాజీపూర్ సబ్-ఇన్‌స్పెక్టర్ జి నరేష్ తెలిపారు. అతనితో పాటు అతని తండ్రి కూడా నది ఒడ్డున బట్టలు ఉతకడానికి నిలబడి ఉన్నట్లు తెలిపారు. తండ్రి తన కొడుకును రక్షించడానికి ప్రయత్నించినప్పటికి ఫలితం లేకపోయింది. శ్రావణ్ తండ్రి ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు మృతదేహాన్ని వెతికే ప్రయత్నాలు ప్రారంభించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.