calender_icon.png 28 December, 2024 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నను హతమార్చి.. తమ్ముడు పరారీ

02-10-2024 12:17:04 PM

అన్న హత్యకు ఆస్తి తగాదాలే కారణమంటున్న గ్రామస్తులు

జగిత్యాల, (విజయక్రాంతి): ఆస్తిపాస్తులు వివాదం అన్నదమ్ముల మధ్య చిచ్చు రేపుతున్నాయి. రక్త సంబంధం మరిచి అన్నదమ్ముల ప్రాణాలు హరించేలా చేస్తున్నాయి. ఇలాంటి సంఘటనే బుధవారం జగిత్యాల మండలం అంతర్గం గ్రామంలో చోటు చేసుకుంది. అన్న విద్యాసాగర్ (32) పై కత్తి తో దాడి చేసి దారుణం హత్య చేసిన తమ్ముడు విక్రమ్ పరారీ అయ్యారు. విక్రమ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే అన్నదమ్ముల మధ్య గత కొంత కాలంలో నెలకొన్న ఆస్తి తగాదాలే విద్యాసాగర్ హత్యకు కారణం అని అంతర్గo గ్రామస్తులు చెపుతున్న చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.