శివ్వంపేట: మెదక్ జిల్లా శివంపేట్ మండలం విక్కీ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని నాను తండాకు చెందిన తేజావత్ చందర్ కు ఇద్దరు కుమారులు గోపాల్, శంకర్ ఉన్నారు. వీరు రాత్రి భోజనం చేశాక ఒకే రూంలో పడుకున్నారు. కానీ తెల్లవారుజామున తమ్ముడైన గోపాల్ అన్న శంకర్ కాళ్ళకి విద్యుత్ షాక్ పెట్టాడు. శంకర్ కేకలు వేయడంతో గోపాల్ పారిపోయాడు. తండ్రి వచ్చేసరికి శంకర్ (28) మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.