హైదరాబాద్: నగరంలో వరుసగా జరుగుతున్న లైంగిక దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా సైట్ చూపిస్తామని తీసుకెళ్లి ఓ యువతిపై రియల్ ఎస్టేట్ కంపెనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు (సహచర ఉద్యోగులు) లైంగిక దాడికి యత్నించారు. ఈ ఘటన మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లాకు చెందిన ఓ యువతి గత నెలలో నగరానికి వచ్చి ఉప్పల్‌లో నివాసం ఉంటుంది.
మియాపూర్‌లోని జేఎస్‌ఆర్ సన్ సిటీ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ డిపార్ట్‌మెంట్‌లో ట్రైనీగా జాయిన్ అయింది. అదే కంపెనీలో పని చేస్తున్న సంగారెడ్డి, జనార్ధన్ అనే ఇద్దరు వ్యక్తులు సైట్ విజిట్ కోసమంటూ ఆ యువతిని కారులో తీసుకెళ్లారు. యాదాద్రిలో సైట్ విజిట్ చేసిన అనంతరం హైదరాబాద్ వస్తుండగా యువతి అనారోగ్యంతో ఉన్నానని చెప్పిన విన్నకుండా మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ తనతో తాగించి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడారు.
నాలుగు గంటలు కారులో తిప్పుతూ యువతిని నరకయాతన పెట్టారు. వారి నుంచి తప్పించుకున్న యువతి బంధువుల సహాయంతో మంగళవారం రాత్రి ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి, అక్కడి నుంచి కేసును మియాపూర్ పీఎస్‌కు బదిలీ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు.