calender_icon.png 21 November, 2024 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమ పేరుతో మోసం చేశాడని యువతి నిరసన

14-11-2024 12:54:12 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని కన్నెపల్లి మండలం అయిదు పూర్ గ్రామానికి చెందిన యువతి భీమిని మండలం వెంకటాపూర్ గ్రామంలో గురువారం ప్రియుడు పుట్ట శ్రీకాంత్ ఇంటి ఎదుట నిరసన చేపట్టింది. ప్రేమించానని నమ్మించి తనను శారీరకంగా లొంగదీసుకున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకొంది. కన్నెపల్లి ఎస్సై గంగారం యువతీకి న్యాయం జరిగేలా చూస్తారని హామీ ఇవ్వడంతో నిరసన విరమించింది. యువ తిని పోలీసులు ఆమె తల్లిదండ్రులకు అప్పచెప్పారు.