23-03-2025 10:12:43 PM
జహీరాబాద్: జహీరాబాద్ పట్టణంలో యువతి అదృశ్యం అయిందని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని పట్టణ ఎస్సై కాశీనాథ్ తెలిపారు. జహీరాబాద్ పట్టణంలో ని రాంనగర్ కు చెందిన రాథోడ్ నిరుషా (24) ఈనెల 18వ తేదీన ఉదయం 10:30 గంటలకు ఇంట్లో నుంచి బయటకు పోయి తిరిగి రాలేదని ఫిర్యాదు చేశారన్నారు. యువతి తల్లి రాథోడ్ కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.