07-03-2025 08:48:19 AM
కేపీహెచ్‌బీ: హైదరాబాద్ కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్(KPHB Metro Station) వద్ద కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తు(Drunk driving)లో కారు నడిపిన యువతి అదుపుతప్పి కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ దగ్గర బైక్‌ను ఢీకొట్టింది. రోడ్డు ప్రమాదం చేయడంతో పాటు వాహనదారుడిని యువతులు బెదిరించినట్లు బాధితుడు తెలిపాడు. మద్యం మత్తులో కారులో తిరుగుతూ యువతులు హల్చల్ చేశారు. దీంతో బాధితుడు ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనాస్థలికి చేరుకున్న ట్రాపిక్ పోలీసులు కారు నడిపిన యువతికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడంతో రీడింగ్ 212 పాయింట్లుగా నమోదవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.