calender_icon.png 12 February, 2025 | 5:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో యువతి మృతి

12-02-2025 02:35:31 PM

కూకట్ పల్లి,(విజయక్రాంతి): గుర్తు తెలియని వాహనం టీవీఎస్ స్కూటీని ఢీకొన్ని ఓ యువతి మృతి చెందిన సంఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూసాపేట జనతా నగర్ లో నివాసం ఉంటున్న ఎన్ మమత(17) ప్రైవేటు ఉద్యోగం చేస్తుంది. తన స్నేహితుడు నరేష్ తో కలిసి టీవీఎస్ స్కూటీపై మూసాపేట నుంచి కూకట్ పల్లి వైపు వెళ్తుండగా మెట్రో స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వాహనం స్కూటీని ఢీకొట్టడంతో నరేష్, మమతలు కింద పడిపోయారు. దీంతో గాయాల పాలైన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించడంతో వైద్యులు పరిశీలించి మమత మృతి చెందినట్లు ధృవికరించారు. మృతురాలి తల్లి కుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.