calender_icon.png 6 April, 2025 | 1:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతి అదృశ్యంపై కేసు నమోదు

05-04-2025 09:01:59 PM

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా యువతి అదృశ్యమైన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎల్లారెడ్డి మండలంలోని అల్మాజిపూర్ గ్రామానికి చెందిన ఎరుకల మధుమతి (21)కి గత సంవత్సరం క్రితం జంగమయ్యపల్లి గ్రామానికి చెందిన మహేందర్ తో వివాహం జరిగింది. వారి ఇద్దరి మధ్య గొడవలు కారణంగా గత 4 నెలల నుండి మధుమతి అల్మాజికపూర్ గ్రామంలో తన అమ్మగారి ఇంటి వద్దనే ఉంటుంది. ఈనెల 4వ తారీఖునాడు మధుమతి ఆమె తల్లి అయిన సుగుణ, ఆమె తమ్ముడు అందరూ కలిసి తిని రాత్రి 10 గంటలకు పడుకున్నారని, డ్యూటీకి వెళ్లిన మధుమతి తండ్రి ఆయన పోచయ్య అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చి చూడగా మధుమతి ఇంట్లో కనిపించలేదు. ఆమె కోసం చుట్టు పక్కల వెతకగా ఆచూకీ దొరకకపోవడంతో మధుమతి తండ్రి పోచయ్య ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడని పేర్కొన్నారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మహేష్ తెలిపారు.