చింతలగూడెం : నల్గొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మాడుగులపల్లి మండలం చింతలగూడెంకి చెందిన కల్యాణ(18) అనే యువతి ఆకతాయిల వేధింపులు భరించలేక జూన్ 6వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కల్యాణి స్థానిక దవాఖానలో చికిత్సపొదుతూ బుధవారం మృతి చెందింది. దీంతో కళ్యాణి తల్లి శివ, మధుపై మాడుగులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు ఆకతాయిలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.