-పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్ కత్తా కు చెందిన యువతిగా గుర్తింపు
-మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): హాస్టల్ భవనం పైనుండి ఓ యువతి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్ కత్తా(Kolkata) కు చెందిన రిసోజ బస్ (22) కొంతకాలంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సిద్ధిక్ నగర్ జోలో స్టెర్లింగ్ పోలింగ్ హాస్టల్లో ఉంటూ ఓ ప్రైవేట్ ఐటీ కంపెనీలో హెచ్ఆర్ విభాగంలో పనిచేస్తుంది. సోమవారం ఉదయాన్నే ఇక నేను ఉండను కేవలం నా వస్తువులు మాత్రమే ఉంటాయని సోమవారం అర్ధరాత్రి వేళ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.
ఆ మెసేజ్ చూసిన రిసోజా బస్ మిత్రుడు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన తల్లిదండ్రులు రిసోజ బస్ కు పలుమార్లు ఫోన్ చేసిన రెస్పాన్స్ రాలేదు. కాగా తాను ఉంటున్న హాస్టల్ సిబ్బందికి ఫోన్ చేసి అడగగా, రిసోజ బస్ తాను ఉంటున్న హాస్టల్ భవనం 6వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు.సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు(Madhapur Police) మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఆత్మహత్యకు అనారోగ్య కారణంగా పోలీసులు భావిస్తున్నారు.