calender_icon.png 3 March, 2025 | 2:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్యాన్స్ మాస్టర్ వేధింపులు!

01-03-2025 11:23:32 PM

సెల్ఫీ వీడియో తీసుకుని యువతి ఆత్మహత్య 

ఖమ్మం,(విజయక్రాంతి): ఓ డ్యాన్స్ మాస్టర్ వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్‌లో శనివారం జరిగింది. ఖమ్మం వీడియోస్ కాలనీకి చెందిన కావ్య కళ్యాణి.. ఓ టీవీ ఛానల్‌లో ప్రసారమయ్యే డ్యాన్స్ షోలో పొల్గొన్నది. ఆ సమయంలో అదే షోలో డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేసే ఖమ్మంకు చెందిన అభిలాష్ అనే యువకుడిని ప్రేమించి, పెళ్ళి చేసుకుంది. గత ఐదేళ్లు ఇద్దరూ కలిసి ఖమ్మంలోని మామిళ్లగూడెంలో నివాసం ఉన్నారు. ఇటీవలే నివాసాన్ని పొన్నేకల్‌కు మార్చారు. ఈ క్రమంలోనే శనివారం కావ్య కళ్యాణి సెల్ఫీ వీడియో తీసుకుని, తన చావుకు అభిలాషే కారణమని చెప్పి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఆస్తి మీద వ్యామోహంతో అభిలాష్ మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడటంతోనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం రూరల్ పోలీసులు అభిలాష్‌ను అదుపులోకి తీసుకున్నారు.