calender_icon.png 6 March, 2025 | 9:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనస్థాపానికి గురై యువతి ఆత్మహత్య

06-03-2025 06:09:10 PM

చిట్యాల మండలం ఒడితల గ్రామంలో విషాదం..

చిట్యాల (విజయక్రాంతి): మనస్థాపానికి గురై ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ఒడితల గ్రామంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. చిట్యాల రెండవ ఎస్ఐ ఈశ్వరయ్య కథనాల ప్రకారం... గ్రామానికి చెందిన ఎర్రబెల్లి పల్లవి (19) చదువు కొనసాగిస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా ఆమె తండ్రి సదానందం, విజయ అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్య చికిత్స కోసం లక్షల్లో ఖర్చు అవుతుందని కూతురు పల్లవి ఆవేదనకు గురవుతుంది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి సదానందం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కన్న కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అమ్ముతున్నాయి.