హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 22 (విజయక్రాంతి): రామంతా పూర్‌లోని డీఎస్‌ఎన్ మాల్ పై నుంచి దూకి యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. పోలీసు లు తెలిపిన వివరాలు.. తుకారం గేట్ నార్త్ లాలాగూడకు చెందిన పిన్నపాటి రమేష్‌కు ఇద్దరు కూతుళ్లు. ఇటీవలె పెద్ద కూతురు పెళ్లి జరిగింది.
చిన్న కూతురు పిన్నపాటి హరిత(24).. క్లుంట్ సర్వీస్ సొల్యూషన్స్‌లో కస్టమర్ రిలేషన్స్ ఎగ్జిక్యూటివ్ గా విధులు నిర్వహిస్తుంది. అక్టోబర్ 21న యథావిధి గా సాయంత్రం ఐదు గంటలకు డ్యూటీకి వెళ్లి 22 ఉదయం నాలుగు గంటలకు ఇంటికి రావాల్సి ఉంది. అయితే అదేరోజు రాత్రి హరిత స్థానిక డీసీఎస్ మాల్ 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ విషయమై హరిత టీం లీడర్ ఆమె తండ్రికి, ఉప్పల్ పోలీసులు సమాచారం అం దించింది. పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బం దులతోనే హరిత ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమా నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.