calender_icon.png 20 January, 2025 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేర్వేరు ఘటనలో ఇద్దరు మృతి

19-01-2025 11:13:04 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): వేర్వేరు ఘటనలో యువతి, యువకుడు మృతి చెందిన సంఘటన ఆసిఫాబాద్ మండలంలో చోటు చేసుకుంది. ఆంకుశాపూర్ గ్రామానికి చెందిన కోట సింధు (20) ఆసిఫాబాద్ రోడ్డు రైల్వే స్టేషన్ పరిధిలోని పుంజుమేర గూడ సమీపంలో ట్రెన్‌కు పడి ఆత్మహత్య చేసుకుంది. హన్మకొండలో డిగ్రీ చదువుతున్న యువతి సంక్రాతి సెలవులకు ఇంటి వచ్చింది.పరీక్షలు ఉన్నాయని ఈ నెల 16న ఇంటి నుంచి హన్మకొండకు వేళ్లింది.ఇంతలోనే ఆదివారం రైల్వే ట్రాక్‌పై శవం అయ్యి కనిపించింది. స్థానికులు రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో యువతి తంద్రి కొమురయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మండలంలోని ఇప్పల్‌నవేగాం సమీపంలో జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ధస్నాపూర్‌కు చెందిన హరికృష్ణ అక్కడిక్కడే మృతి చెందాడు. వాంకిడి వైపు నుంచి ఆసిఫాబాద్‌కు బైక్‌పై వస్తున్న యువకుడు వాహనం అదుపు తప్పడంతో డి వైడర్‌కు బైక్ ఢీ కొట్టింది. దీంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అంకుశాపూర్‌లో యువతి, దస్నాపూర్‌లో యువకుడు మృతి చెందడంలో గ్రామాలలో విషాధఛాయలు అలుముకున్నాయి.