బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణం నుండి కారణాల బస్తీకి చెందిన వీరబత్తుల ప్రవీణ్ అనే యువ సింగరేణి కార్మికుడు శుక్రవారం తన ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబంలో చోటుచేసుకున్న కలహాలతోనే మనస్థాపానికి గురై ప్రవీణ్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. బెల్లంపల్లి లోని శాంతిఖని గనిలో కార్మికులుగా పనిచేస్తున్న ప్రవీణ్ కు ఫిబ్రవరిలో వివాహమైంది. వివాహం జరిగిన కొద్ది రోజుల్లోనే భార్య వెళ్లిపోవడంతో ప్రవీణ్ తీవ్ర మనస్థాపానికి గురవుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఆత్మహత్య చేసుకోవడం పలువురుని కలిసివేసింది. మృతి చెందిన ప్రవీణ్ తెలంగాణ ఉద్యమంలో తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా బెల్లంపల్లి సమస్యలను వెలికి తెచ్చి పలువురి ప్రశంసలందుకున్నారు.