కోల్‌కతాలో పునరుద్ఘాటించిన నారాయణమూర్తి
కోల్‌కతా, డిసెంబర్ 16: దేశ యువత వారానికి 70 గంటల చొప్పున పని చేయాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పునరుద్ఘాటించారు. కోల్‌కత్తాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన తాజాగా పాల్గొని మాట్లాడారు. ఇన్ఫోసిస్‌ను తాము ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ కంపెనీలతో పోలుస్తామని చెప్పారు. అలా పోలుస్తున్న సందర్భంలో భారతీయులు చేయాల్సింది ఇంకా చాలా ఉందనిపిస్తుంటుందని పేర్కొన్నారు.
మన దేశంలో ఇంకా దాదాపు 80 కోట్ల మంది ఉచిత రేషన్ తీసుకుంటున్నట్టు తెలిపారు. దీనిబట్టి చూస్తే ఆ 80 కోట్ల మంది ఇంకా పేదరికంలో ఉన్నారన్న విషయం అర్థమవుతుం దన్నారు. వారానికి 70 గంటలు పని చేయకపోతే మనం ఈ పేదరికం నుంచి ఎలా అధిగమించగలమని ప్రశ్నించారు. మనం కష్టపడి పనిచేసే స్థితిలో లేకపోతే ఇంకెవరు పని చేస్తారన్నారు. భవిష్యత్తు కోసం కలిసికట్టుగా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ముఖ్యంగా యువత తమ ఆశలు, ఆకాంక్షలు ఉన్నతంగా ఉంచుకోవాలని తెలిపారు. కాగా గతంలో ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌ఓ మోహన్‌దాస్ పాయ్ వ్యాఖ్యతగా వ్యవహరించిన ‘ది రికార్డ్’ అనే పాడ్‌కాస్ట్ మొదటి ఎపిసోడ్‌లో మాట్లాడిన నారాయణమూర్తి.. ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్‌లో ఉత్పాదకత తక్కువన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ వంటి దేశౠలు ఎలా అయితే కష్టపడ్డాయో అలా భారత ప్రజలు శ్రమించాలన్నారు.
అభివృధ్ది చెందిన దేశాలతో పటీ పడాలంటే భారత యువత వారానికి 70 గంటలపాటు పని చేయాలన్నారు. దీనిపై అప్పట్లో మిశ్రమ స్పందనలు రాగా.. తాజాగా ఆయన మరోసారి తన మాటలను సమర్థించుకున్నారు.