calender_icon.png 1 April, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువకులు వ్యసనాలకు దూరంగా ఉండాలి

29-03-2025 06:53:03 PM

జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): యువకులు వ్యసనాలకు దూరంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ అన్నారు. ఇటీవల జరిగిన జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన లక్కినేని సత్యనారాయణను పవర్ హౌస్ జిమ్ నిర్వాహకులు, కోచ్ షమీఉద్దీన్ శాలువ, పూలబొకేలతో ఘనంగా సన్మానించారు. ఈ సంధర్భంగా లక్కినేని మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా సక్రమమైన మార్గంలో వెళ్తూ తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని, ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా దృఢంగా, ఆరోగ్యంగా ఉంటారన్నారు.

ఎందుకంటే దేశ భవిష్యత్తు యువతి యువకులపైనే ఆధారపడి ఉందని, యువత ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉన్నట్టు అని అన్నారు. షమీ ఉద్దీన్ కోచ్ నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ నెగ్గడం, అదేవిధంగా ఎన్నో ఏళ్ళుగా తన శిక్షణలో వందలాది మంది యువతి, యువకులను రాష్ట్ర, జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో ఎనలేని కృషి ఉందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు యెర్రా కామేష్, మారపాక రమేష్, నున్న శివ, అజయ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.