19-04-2025 08:46:51 PM
తాడ్వాయి (విజయక్రాంతి): యువకులు ఆరోగ్యవంతనైన జీవితం గడపాలని నార్కోటిక్స్ సీఐ కృష్ణమూర్తి తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో శనివారం కల్తీ కల్లు, డ్రగ్స్ వాడకం పై ప్రత్యేక అవగాహన సధస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. యువకులు కల్తీ కల్లు, డ్రగ్స్ బారిన పడవద్దని ఆయన సూచించారు. కల్తీ కల్లు తాగి ఆరోగ్యాలు నాశనం చేసుకోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో సదాశివనగర్ సీఐ సంతోష్, ఎస్సై వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.