09-04-2025 12:34:43 AM
ఎడిటింగ్ చేసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ వైరల్‌గా మారిన వీడియో
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 8 (విజయక్రాంతి) ప్రజా అవసరాల కోసం వినియో గించే పోలీస్ వాహనాన్ని కొంతమంది యువకులు రిల్స్ కోసం ఉపయోగించారు. తాము తీసిన వీడియోను ఎడిటింగ్ చేసి వారి వారి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రజలు కట్టే పన్నుల ఆధారంగా ప్రజా రక్షణ కోసం ఉపయోగించే వా హనాలను ఇలా రీల్స్ చేసేందుకు ఉపయోగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమ య్యాయి.
నాగర్ కర్నూల్ జిల్లా ఈగలపెంట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ వాహ నం దోమలపెంట పరిసరాల్లో టిఎస్ 09 పీఏ4622 అనే వాహనాన్ని రీల్స్ కోసం ఉపయోగించినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది.
ఆ రీల్స్ కోసం వినియోగించిన యువత ఎవరన్న విషయాన్ని పోలీసులు విచారణ ప్రారంభించారు. పోలీస్ అధికారులకు తెలియకుం డానే పోలీసు వాహనాలను దొంగిలించారా లేదా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.