calender_icon.png 22 December, 2024 | 5:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాలో వేరువేరుగా ఇద్దరు యువకులు ఆత్మహత్య

13-09-2024 05:13:59 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఇద్దరు యువకులు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరు జూలైగా తిరిగితే తల్లిదండ్రులు మందలించడంతో మనోవేదన చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోగా మరో ఒకరు కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసిన కామారెడ్డి జిల్లాలో నెలకొన్నాయి. స్థానికులు పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మా నగర్ గ్రామానికి చెందిన బొల్లారం నాందేవ్(23) అనే యువకుడు జులైగా తిరుగుతుంటే తల్లిదండ్రులు మందలించారు. దీంతో కలత చెంది పిట్లం శివారులో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పిట్లం ఎస్ఐ తెలిపారు. మృతుని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్స్వాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పిట్లం పోలీసులు తెలిపారు. 

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్ద పోతంగల్ గ్రామ శివారులో బుగ్గ రామేశ్వర ఆలయం సమీపంలో అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతనిది సంగారెడ్డి జిల్లా సిద్దాపూర్ మండలం ఖాజాపూర్ గ్రామానికి చెందిన చాకలి వెంకటి(26) అనే యువకుడు భార్యతో గొడవ పడి గాంధారిలో ఉన్న తన చెల్లి ఇంటికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి గురువారం వెళ్లగా గాంధారికి వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు వెతకగా చాకలి వెంకటి గాంధారి మండలం పెద్ద పోతంగల్ గ్రామ శివారులోని బుగ్గ రామేశ్వర ఆలయం సమీపంలో అడవిలో చెట్టుకూ ఉరి వేసుకుని ఉన్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించి గాంధారి పోలీసులకు సమాచారం అందించారు. గాంధా రీ ఎస్సై ఆంజనేయులు పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు గాంధారి ఎస్సై ఆంజనేయులు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో ఇద్దరు యువకులు ఒకేరోజు వేరువేరు స్థలాల్లో ఆత్మహత్య చేసుకోవడం జిల్లాలో కలకలం సృష్టించింది.