calender_icon.png 19 January, 2025 | 12:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్తులో కన్న బిడ్డల్ని కడతేర్చే యత్నం చేసిన కన్నతల్లి

13-08-2024 02:32:48 PM

అడ్డుకున్న యువకుడు దక్కిన ప్రాణాలు..జడ్చర్ల లో ఘటన

జడ్చర్లఓ మహిళ మద్యం మైకంలో తన నెల రోజుల పసికందును గొంతుపిసికి చంపబోయింది. ఈ దర్ఘటన జడ్చర్ల రైల్వే ట్రాక్ పక్కనే చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... జడ్చర్ల మండలం చిన్న ఆదిరాల గ్రామానికి చెందిన పార్వతి(22)కి ఇద్దరు ఆడపిల్లలు కాగా, ఇందులో పెద్దది అనిత(3), చిన్నమ్మాయి (1నెల రోజులు) ఉంది. పార్వతి తన భర్త యాదయ్యతో కలిసి జడ్చర్ల పట్టణానికి వచ్చి ఓ కల్లు దుఖాణంలో పీలకదాకా తాగింది. తాగిన మత్తులో భర్త కూడ భార్యను పట్టణంలోనే వదిలేసి వెళ్లి పోయాడు. ఇదిలా ఉంటే పార్వతి తన ఇద్దరు పిల్లలను తీసుకుని పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు చేరుకుంది.

పెద్దమ్మాయి అనితకు బిస్కట్ ప్యాకెట్ ఇచ్చి, చేతిలో ఉన్న పసి కందును గోంతు పిసికి చంపబోయింది. ఈ దర్ఘటన గమనించిన ముబీన్ అనే వ్యక్తి తల్లి చేతిలో ఉన్న పసికందును తీసుకుని వెంటనే 108 వాహనానికి సమాచారం ఇచ్చి, తల్లి, ఇద్దరు పిల్లలను జడ్చర్ల పట్టణ శివారులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలని పరిశీలించిన ఆస్పత్రి వైద్యులు ఆమె కల్లు తాగిన మత్తులో పిల్లలను చంపేసి తాను కూడ రైల్వే ట్రాక్పై పడి చనిపోయో ప్రయత్నం చేసినట్లు తెలిపారు. సమయానికి అటుగా వెళుతున్న యువకుడు ఈ ఘటనను చూసి తల్లి బిడ్డల ప్రాణాలు కాపాడడంతో పట్టణ ప్రజలు ముబీన్ అభినందించారు.