calender_icon.png 1 April, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నారి నారి నడుమ మురారి

29-03-2025 03:55:20 PM

ఇద్దరి యువతులను పెళ్లాడిన యువకుడు

ఓకే వేదికపై జరిగిన వివాహ తంతు

శుభలేఖ లోను అచ్చు

వేడుకకు హాజరైన 500 మంది అతిథులు

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఈ రోజుల్లో  ఒకరితో వివాహ జీవితం గడపడమే గగనం అనుకునే రోజుల్లో యువకుడు ఒకే వేదికపై ఇద్దరి యువతులను పెళ్లి చేసుకొని అందరి అతిథులను అబ్బురపరిచాడు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూరు గ్రామంలో ఓ యువకుడు ఇద్దరి యువతులతో ప్రేమలో పడ్డాడు. ఈ విషయం ఆ యువతులకు చెప్పి పెళ్లికి ఒప్పించాడు. ఇంకేముంది వివాహం జరగడమే ఆలస్యం. పెళ్లి పత్రికలో ఇద్దరి యువతులతో వివాహం చేసుకుంటున్నట్లు అచ్చు వేయించి మరి ఆహ్వానం పలికాడు. 500 మందికి పైగా బంధువులు వివాహ వేడుకకు హాజరయ్యారు.మూడేళ్ల కిందట మొదలైన ఆ యువకుడి ప్రేమ ప్రస్థానం బంధువుల సమక్షంలో వివాహంతో ముగ్గురు ఒకటయ్యారు. వివాహంలో తీసిన ఫోటోలు, శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లయిన భర్త పరాయి ఆడదాన్ని చూస్తేనే భరించలేని రోజుల్లో ఏకంగా ఆ యువకుడు ఇద్దరి యువతులను పెళ్లి చేసుకోవడంతో చర్చకు దారి తీసింది.