calender_icon.png 24 December, 2024 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చార్జర్‌ కోసం మహిళను చంపేసిన యువకుడు

26-08-2024 04:10:03 PM

మేడ్చల్: సెల్ ఫోన్ చార్జర్ కోసం మహళను చంపేసిన ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ లో సోమవారం చోటుచేసుకుంది. శాంత అనే మహిళ దుండిగల్ లో బెల్డ్ షాప్ నిర్వహిస్తుంది. అయితే కమల్ కుమార్ అనే యువకుడు తన ఫోన్ లో చార్జింగ్ అయిపోవడంతో మహిళను చార్జర్ అడిగాడు. దీంతో శాంత చార్జర్ ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి గొడవ పడ్డారు. ఇంతలోనే యువకుడు శాంతను హత్యచేశాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.