calender_icon.png 17 March, 2025 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు దాటుతూ పడిపోయిన యువకుడు

16-03-2025 11:38:10 PM

సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ పోలీసులు...

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): రోడ్డు దాటుతూ పడిపోయిన ఓ వ్యక్తికి అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు సీపీఆర్ చేసి అతని ప్రాణాలు కాపాడారు. నగరంలోని బేగంపేట పీఎన్జీ జంక్షన్ వద్ద జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పీఎన్జీ జంక్షన్‌లో రోడ్డు దాటుతూ ఓ వ్యక్తి రోడ్డుపైనే పడిపోయాడు. ఎండదెబ్బ తగలడంతో అతను అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. ఇది గమనించి అక్కడే విధులు నిర్వహిస్తున్నా బేగంపేట ట్రాఫిక్ సీఐ పాపయ్య, సిబ్బంది అతన్ని వెంటనే పక్కకు తీసుకొచ్చారు. ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఆనంద్, హైదర్‌లు అతనికి సీపీఆర్ చేయడంతో మామూలు స్థితికి రావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతని సెల్‌ఫోన్ ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారమందించారు. బాదితుడు ఆసిఫాబాద్ కొమురం బీం జిల్లాకు చెందిన వాడిగా గుర్తించారు. గాంధీలో చికిత్స అనంతరం సాయంత్రం అతన్ని డిశ్చార్జ్ చేశారు. సకాలంలో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన పోలీసులను పలువురు అభినందించారు.