calender_icon.png 24 February, 2025 | 9:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆన్‌లైన్ బెట్టింగ్‌కు యువకుడి బలి

18-02-2025 01:30:41 AM

* ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై మరో యువకుడు..

కామారెడ్డి, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి)/ శేరిలింగంపల్లి: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడ్డ ఓ యువకుడు డబ్బులు పోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగింది. దేవునిపల్లికి చెందిన చాకలి చింటు (27) కొంత కాలంగా బెట్టింగులకు పాల్పడుతూ అప్పులపాలయ్యాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో కోటి 30 లక్షలు పోగొట్టుకున్నాడు. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో ఇంట్లో రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.

మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మాదాపూర్ ఖానామెట్‌కు చెందిన అరవింద్ (23) ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. ఆన్‌లైన్ గేమ్స్ బానిసై రూ. 2 లక్షలు పోగొట్టుకున్నాడు. దీంతో ఇంట్లో నుంచి పారిపోయాడు. చివరకు కుటుంబ సభ్యులు అతడ్ని వెతికి ఇంటికి తీసుకొచ్చి, మందలించారు. తీరును మార్చుకోని అరవింద్ మళ్లీ గేమ్స్ ఆడటం ప్రారంభించాడు. ఆదివారం రాత్రి కూడా గేమ్ ఆడి రూ.60 వేలు పోగొట్టుకొని, మనస్తాపంతో ఉరేసుకొని చనిపోయాడు.