23-04-2025 08:47:32 PM
పాపన్నపేట: ఒంటిపై పెట్రోల్ పోసుకొని గాయాలతో చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కొడుపాక గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఏఎస్సై సంగన్న కథనం ప్రకారం... గ్రామానికి చెందిన అవుసుల శ్రీకాంత్ (24) స్వర్ణకారుడుగా పనిచేస్తు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల 21న రాత్రి ఇంట్లో భార్య, తల్లికి మధ్య సంసార విషయంలో చిన్నపాటి గొడవ చోటు చేసుకుంది. ఇద్దరిని ఏమి అనలేక మనస్తాపం చెందిన శ్రీకాంత్ వంటింట్లోకి వెళ్లి అక్కడ ఉన్న పెట్రోల్ ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. వెంటనే గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించి అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు.