14-03-2025 06:00:51 PM
చేగుంట,(విజయక్రాంతి): ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన చేగుంట పట్టణ కేంద్రంలో జరిగింది, చేగుంట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణ కేంద్రానికి చెందిన పుల్ల బోయిన శేఖర్ (26) గురువారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. శుక్రవారం ఉదయం వడ్డియారం రైల్వే అండర్ బ్రిడ్జి కింద మృతదేహం కనిపించింది, ఇది గమనించిన స్థానికులు చేగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు, సంఘటనస్త్రానికి చేరుకున్న చేగుంట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.