calender_icon.png 27 April, 2025 | 1:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండెపోటుతో యువకుడు మృతి

26-04-2025 06:25:28 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): మండలంలో గుండెపోటుతో యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన యువకుడు వగలగాని నరహరి(32) రాత్రి చేతిలో నొప్పి రావడంతో తుంగతుర్తి ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యుడు సూర్యాపేట ఏరియా తీసుకు వెళ్లాల్సిందిగా సూచనలు చేశారు. దీంతో నరహరిని సూర్యాపేటకు తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో తీవ్రమై గుండె నొప్పితో మృతి చెందాడు. మృతుడికి భార్య కుమారుడు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యులను జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల ప్రగడ కిషన్ రావు, ఆవుల కోమరవెల్లి, సుదర్శన్ విడుదల వీరన్న శ్రీను తదితరులు మృతదేహాన్ని సందర్శించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.