calender_icon.png 25 January, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యానికి బానిసై యువకుడి మృతి

25-01-2025 01:18:08 AM

 హుజురాబాద్, జనవరి24 :  మద్యానికి బానిసై యువకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని హైస్కూల్ క్రీడా మైదానంలో శుక్రవారంవాకర్స్ కి మృతదేహం కనబడడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. పట్టణంలోని గణేష్ నగర్ కు చెందిన రాజు (36)గా గుర్తించారు.

కుటుంబ సభ్యులు, పోలీసుల తెలిపిన తెలిపిన వివరాల ప్రకారం అనారోగ్య కారణంతో బాధపడుతూ మద్యానికి బానిస అయినట్లు వారు తెలిపారు. ఆసుపత్రికి తీసుకువెళ్లగా వైద్యులు మద్యం తాగవద్దని హెచ్చరించారు. అయినప్పటికీ రాజు వినకుండా మద్యం తాగుతూ ఉన్నాడు రాజుకు ఫిట్స్ ఉందని వారు తెలిపారు.

మృతుడికి భార్య శిరీష, ఇద్దరు కుమారులు ఒక కుమార్తె కలదు. భార్య శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ తిరుమల్ గౌడ్ తెలిపారు.