calender_icon.png 15 March, 2025 | 1:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

15-03-2025 12:00:00 AM

ఆదిలాబాద్, మార్చ్ 14 (విజయ క్రాంతి): హోలీ పండగ పూట విషాదం నెలకొంది. ఆదిలాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కొత్త కుమ్మరి వాడ కు చెందిన జిల్లెడ్వార్ రుషి కుమార్ (16), తన స్నేహితుడు ప్రేమ్ కుమార్‌తో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్న క్రమంలో వాహనం ఆదుపుతప్పడంతో కిందపడి మృతిచెందాడు. ఆప్పటివరకు ఇంటి వద్ద సేహ్నితులతో కలిసి ఆనందోత్సా హాలతో హోలీ ఆడుకున్నాడు. అనంతరం తన స్నేహితుడు అశ్విన్ ను కచ్ కంటి గ్రామ రోడ్డు వద్ద దింపెసి, తిరిగి ఇంటికి వస్తున్నారు.

ఈ క్రమంలో మోటార్ సైకిల్  నడుపుతూన్న రిషి కుమార్ ఏరోడ్రమ్ దాటిన తర్వాత కుమ్మరికుంట వద్ద అతి వేగంగా అజాగ్రత్తగా నడపడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోయడు. వారి ని 108 అంబులెన్స్ లో రిమ్స్ కు తరలిం చారు. వైద్యులు పరిక్షించాగా అప్పటికే రిషికుమార్ మృతి చెందినట్లు తెలిపారు. రుషి కుమార్, ప్రేమ్ కుమార్ లు కాగా ఇద్దరు  సేవాదాస్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్నారు. పరీక్షలు సమీపిస్తున్న వేళ విద్యార్ధి చనిపోవడంతో తల్లిదండ్రులతో పాటు తోటి విద్యార్థులు కన్నీటి పర్యంతం అయ్యారు.