24-02-2025 12:00:00 AM
మందమర్రి, ఫిబ్రవరి 23 (విజయ క్రాంతి) : పట్టణంలోని పాత బస్టాండ్ జాతీయ రహదారి ఫ్లైఓవర్ వంతెనపై జరిగిన ప్రమాదంలో యువకుడు షేక్ జిలానీ (30) అక్కడికక్కడే మృతి చెందిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని యాపల్ ఏరియా కు చెందిన మృతుడు తన సోదరునితో కలిసి పని నిమిత్తం మంచిర్యాలకు వెళ్ళి తిరిగి బెల్లం పల్లిలోని బంధువుల ఇంటికి వెళ్తుండగా పట్టణంలోని పాత బస్టాండ్ జాతీయ రహ దారి ఫ్లైఓవర్ వంతెనపై బైక్ అదుపు తప్పి డివైడర్ ను డీ కొట్టడంతో బైక్ నడుపుతున్న మృతుడు
అక్కడికక్కడే మృతి చెందగా వెనుకాల కూర్చున్న మృతుని సోదరుడు షేక్ మగ్దూం తీవ్ర గాయాల య్యాయి. మృ తుడు కేకే ఓసిపిలో లారీ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ మేర కు మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపారు.